Bandi Sanjay: దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రంగులు వేసి పండుగ చేసుకుంటున్నారు. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. యువకులు, వృద్ధులు, పేదలు, ధనవంతులు అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నారు. కాగా.. హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు.
Read also: Maldives: మొండివైఖరి వదిలేసి భారత్ తో చర్చలు జరపండి!
ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కన్పించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబురాలు జరుపుకున్నారు.
Priyadarshi: హీరోగా మూడో సినిమా మొదలు.. మొదటిసారి స్టార్ డైరెక్టర్ తో!