Priyadarshi Movie with Mohanakrishna Indraganti Launched: ప్రస్తుతం కమెడియన్ గా అనేక సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ప్రియదర్శి పులికొండ మంచి కథలు దొరికినప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు. అలాగే ఆయన ఇప్పటికే మల్లేశం సినిమాతో పాటు బలగం అనే సినిమాలు చేశాడు. మల్లేశం సినిమా మంచి పేరు తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అదే బలగం విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం కాదు రికార్డులను కూడా బద్దలు కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆయన హీరోగా మూడో సినిమా ఘనంగా ఈరోజు ప్రారంభమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మల్లేశం అనే సినిమా ఒక కొత్త డైరెక్టర్ తో చేశాడు ప్రియదర్శి. బలగం సినిమా కూడా అప్పటికి కొత్త డైరెక్టర్ అయిన వేణు ఎల్దండి దర్శకత్వంలోనే ప్రియదర్శి చేశాడు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రియదర్శి మూడవ సినిమాకి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు.
Kangana Ranaut : కంగనాకు ఎంపీ టికెట్.. వైరల్ అవుతున్న మూడేళ్ల కిందటి ట్వీట్
ఆయన నిజానికి గతంలో ఒక మాదిరి హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్లను అందుకుని స్టార్ డైరెక్టర్ అయ్యాడు. నాని లాంటి హీరోని కూడా లాంచ్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి ఆయనకి ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలు లేవు. సెన్సిబుల్ సినిమాలు చేస్తాడు అనే పేరు ఉన్న ఆయన నుంచి చివరిగా వచ్చిన సినిమా నిరాశపరిచింది. సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. అయితే ఇప్పుడు ప్రియదర్శి పులికొండ హీరోగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో హీరోయిన్ గా నటించిన రూప కొడువాయూర్ హీరోయిన్ గా సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు సినిమాకి సంబంధించిన ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.