Site icon NTV Telugu

Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో కలకలం.. తేనెటీగల దాడితో గందరగోళం.!

Bandi

Bandi

Bandi Sanjay : కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు జనం , కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, రామడుగు మండలం వెదిర సమీపంలో ఒక చిన్న పొరపాటు కారణంగా ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర దృశ్యాలను ఆకాశం నుంచి చిత్రీకరించేందుకు ఉత్సాహంగా ఉన్న కొందరు కార్యకర్తలు డ్రోన్‌ను ఎగరేశారు. అయితే, ఆ డ్రోన్ నియంత్రణ తప్పి పక్కనే ఉన్న ఒక చెట్టుకు ఉన్న తేనెతుట్టెను బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా తేనెటీగలు చెల్లాచెదురై పాదయాత్రలో ఉన్న వారిపై దాడి చేశాయి.

No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

తేనెటీగల దాడితో యాత్రలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది. పలువురు కార్యకర్తలకు తేనెటీగలు కుట్టడంతో వారు గాయపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన మంత్రి బండి సంజయ్ వెంటనే అప్రమత్తమయ్యారు. గాయపడ్డ కార్యకర్తలకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందేలా చూసి, తగిన వైద్య సహాయం చేయించారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత ఆయన తిరిగి తన యాత్రను ప్రారంభించారు. సాయంత్రం 6:30 గంటల కల్లా కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకునే లక్ష్యంతో బండి సంజయ్ తన పాదయాత్రను ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.

Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!

Exit mobile version