NTV Telugu Site icon

Bandi Sanjay: దొంగ దందా చేస్తే మోడీ ప్రభుత్వం వీపంతా సాఫ్ చేస్తది

Bandi Sanjay Nirmal Jilla

Bandi Sanjay Nirmal Jilla

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన వేల కోట్ల రూపాయలను లిక్కర్, డ్రగ్స్, క్యాసినో, రియల్ ఎస్టేట్ దందాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ‘‘కేసీఆర్ ఖబడ్దార్…. కేంద్రంలో ఉన్న నీతి, నిజాయితీతో పనిచేస్తున్న నరేంద్రమోదీ గారి ప్రభుత్వం. నీ వీపంతా సాఫ్ చేస్తరు. అందులో భాగంగానే లిక్కర్ స్కాంలో నీ బిడ్డకు నోటీసులిచ్చారు.’’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.

Read also: YSRCP: బావ, బావమరిది మధ్యలో మామ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఆస్తి గొడవలు

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 6వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం సిర్గాపూర్ లో భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. టిఆర్ఎస్ పార్టీ ఏక్ నిరంజన్ పార్టీ. ఈ దెబ్బతో కేసీఆర్ ఔట్. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి. జోహార్ శ్రీకాంతాచారి. శ్రీకాంత్ చారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఏ ముఖ్యమంత్రి కైనా షెడ్యూల్ ఉంటుంది. కేసీఆర్ కు మాత్రం షెడ్యూల్ అంటూ ఏదీ ఉండదు. తాగి పండుడు తప్ప, కేసీఆర్ కు ఏమీ తెలీదు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి ప్రగతిభవన్ కు… ప్రగతి భవన్ నుంచి బయటికి తెచ్చిన ఘనత బిజెపి దే. కేసీఆర్ ధర్నా చౌక్ ను ఎత్తేస్తే… అదే కేసీఆర్ ను అక్కడికి తీసుకువచ్చింది బిజెపినే అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ లలో కేసీఆర్ కు బిజెపి దెబ్బ రుచి చూపించాం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 4 నుంచి 45 స్థానాలకు వెళ్లి, మనం ఏంటో కేసీఆర్, కేటీఆర్ లకు చూపించాం. మునుగోడులో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేశాడో ప్రజలంతా చూశారని బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు లో ఒక్క బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుడిని ఎదుర్కొనేందుకు… ఒక్కో trs ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నారు. మునుగోడు లో ఒక్క ఓటుకు రూ. 70 వేలు ఇచ్చి, ఓట్లు వేయించుకున్నారు. లంగతనం, దొంగతనం చేసి సంపాదించిన సొమ్మును మునుగోడు లో కుమ్మరించారు. అనేకమంది బిజెపి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో పెట్టారు. బిజెపి అంటేనే టిఆర్ఎస్ నేతలు గజగజ వణుకుతున్నారని, దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు బిజెపి కార్యకర్తలన్నారు. తెగించి కొట్లాడే కార్యకర్తలే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే అన్నారు.

Read also: Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!

మరోసారి కేసీఆర్ ని గెలిపిస్తే సిర్గాపూర్ గ్రామంలో చెప్పులు నెత్తిమీద పెట్టుకుని, తిరగాల్సిన పరిస్థితి వస్తుందని సంచళన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసలైన నిజాం పాలన చూపిస్తున్నాడు కేసీఆర్. సిర్గాపూర్ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? ఇక్కడ పది రూపాయలకు బాటిల్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నారని అన్నారు. తిరుమల, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలను పెట్టిండా? ఫ్యాక్టరీలను పెట్టకుంటే ఆ జాగాలను తిరిగి, రైతులకు ఇవ్వాలా.. వద్దా? పెడితే షుగర్ ఫ్యాక్టరీ పెట్టు… లేకుంటే వాళ్ళ జాగా వాళ్ళకి ఇచ్చేయ్. బిజెపి ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా… రైతుల జాగాలను రైతులకు తిరిగి ఇప్పిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వస్తే బాసర ట్రిపుల్ ఐటిని విస్తరిస్తామని, స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిజెపి ప్రభుత్వం వస్తే… ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. పేదోళ్ల బతుకులు బాగుపడాలంటే బిజెపి ప్రభుత్వం రావాలని అన్నారు.

Read also: CM Jagan: రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శం

సిర్గాపూర్ గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయి? కెసిఆర్ ఎనిమిది నెలల్లో 100 రూములు కట్టుకుని, దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ప్రగతి భవన్.. లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటాడని ఎద్దేవ చేశారు. ఈ మధ్య ఢిల్లీకి కూడా పోతుండు. కేసీఆర్ బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరికింది. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 2bhk హామీ నెరవేర్చలేదు. అభివృద్ధి చేయడానికి పైసలు లేవంటున్న కేసీఆర్ వేల కోట్లు మాత్రం దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. డ్రగ్స్, లిక్కర్, క్యాసినో, గ్రానైట్ ఇలా అన్నిటిలో దందా చేసి, పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడుతున్నారని అన్నారు. పైన ఉన్నది మోడీ ప్రభుత్వం. దొంగ దందా.. లంగ దందా చేసే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే నోటీసులు ఇవ్వరా? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి, ఇప్పుడు తెలంగాణ తరహా ఉద్యమం చేయాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు trs నేతలు?అసలైన తెలంగాణ వాదులము మేమన్నారు.

Read also: CM Jagan: రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శం

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వకుంటే ఈరోజు కేసీఆర్ సీఎం అయ్యే వాడేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు. తెలంగాణ ద్రోహులను సంకలో పెట్టుకున్న పార్టీ… టిఆర్ఎస్ పార్టీ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, కేసీఆర్ మందు తాగి ఇంట్లో పన్నడు. తెలంగాణ రావద్దని కోరుకున్నదే కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ పేరుతో పైసలు వసూలు చేయడానికి. కేసీఆర్ నటనలో జీవిస్తాడు. కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్ష చేశాడు. ఉద్యమంలో బాత్రూంలో కూడా మందు తాగిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టిండా? కారుకు లోన్ పైసలు కట్టే స్తోమతలేని కేసీఆర్… నేడు వేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగాడు? కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్లు దండుకున్నాడు. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక ఎకరానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 30 వేల రూపాయల సబ్సిడీ ఇస్తోంది.

Read also: BJP Bike Rally: ఆందోల్ లో ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీ

కేసీఆర్ ఏమీ ఇస్తలేడు. 1400 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. పేదోళ్ల ఆత్మబలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో నేడు పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కెసిఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల 40 వేల ఇండ్లను మోడీ మంజూరు చేశారు. మోడీ ఇచ్చిన ఇండ్లు, పైసలు ఎక్కడికి పోయాయి? మోడీకి పేరు వస్తుందనే ఇండ్లు ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో ఒక సంవత్సరంలో లక్ష ఇండ్లు కట్టించి, దసరా రోజు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఘనత బిజెపిది అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను, కేసీఆర్ చెత్తబుట్టలో పాడేశాడు. ఉద్యోగాలు ఇవ్వడు, నిరుద్యోగ భృతి ఊసే లేదు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే. ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే అన్నారు. రైతుబంధు హామీ ఏమైంది? రైతుబంధు పేరు చెప్పి రైతులకు వచ్చే ప్రయోజనాలన్నిటినీ, బంద్ పెట్టిండు. పెళ్లయి పిల్లలు పుట్టినా.. కల్యాణ లక్ష్మి చెక్కులు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఏమిటో చెప్పాలి? అని ప్రశ్నించారు. కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు పెంచిండు. ఇంటి పన్ను కూడా పెంచిండు. ఇప్పటికే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుకు చేర్చిండు మళ్లీ ఒకసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే… మరో 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారుస్తాడు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నా బండి సంజయ్.
YSRCP: బావ, బావమరిది మధ్యలో మామ.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఆస్తి గొడవలు