Bandi Sanjay: సర్పంచులతో కలిసి సమరభేరీ.. మౌన దీక్షకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని రోజుల నుంచి తెలంగాణ సర్కార్‌పై విజృంభిస్తోన్న బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు సర్పంచ్‌లతో కలిసి సమరభేరీకి సిద్ధమవుతున్నారు. జూన్ తొలి వారంలో వారితో కలిసి మౌన దీక్షకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్ వేదికగా సర్పంచ్‌లతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, ఇంకా ఆలస్యం చేస్తుండడంతో.. బిల్లులు ఇచ్చేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన ఈ దీక్షకు పూనుకున్నారు. అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బండి సంజయ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
‘పల్లె ప్రగతి’ పేరుతో గత నాలుగు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనులన్నీ సర్పంచులు చేసినా.. వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో గ్రామ పంచాయతీలన్నీ దివాళా తీశాయి. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. బిల్లులు రాకపోవడంతో సర్పంచులంతా అప్పులపాలయ్యారు. ఈ అప్పుల్ని భరించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకోలేక, మరికొందరు ఆస్తులు అమ్ముకొని బతుకుదెరువు కోసం కూలీలుగా మారారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్న బీజేపీ.. భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తొలుత దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్దఎత్తున కార్యాచరణకు సిద్ధం కావాలని ప్రణాళికలు చేపడుతున్నారు.
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
కేంద్ర ప్రభుత్వ లక్షల కోట్ల నిధులు ఇస్తోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవైపు పంచాయతీలకు నిధులిస్తున్నట్లు ఉత్తర్వులిస్తూనే.. మరోవైపు ఆ నిధులను ఫ్రీజ్ చేస్తూ సర్పంచులను మానసిక క్షోభకు గురిచేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్‌లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు
-
E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!