Bandi Sanjay: టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్… మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి విడత పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మారింది, ఇక, రెండో విడత పాదయాత్ర 5 జిల్లాల మీదుగా 348 కిలోమీటర్లు సాగుతోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై చాలా మంది ఫిర్యాదులు వచ్చాయన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పి నేతలు పత్తా లేకుండా పోయారని మండిపడ్డారు.
Read Also: Paddy Procurement: ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు.. సీఎస్ సమీక్ష..
Also Read
- Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
- Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!
- KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కసిగా ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి పాదయాత్రకు జనాలను రప్పించలేదన్న ఆయన.. ఎక్కడి వారు అక్కడే పాదయాత్రలో పాల్గొనే ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన విజ్ఞాపన పత్రాలను ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఆర్‌డీఎస్ సమస్యను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ పాటిల్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇక, తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు వచ్చి ఏం సాధిస్తారు? అని ప్రశ్నించారు బండి సంజయ్.. టీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్నారు.. దానికి హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Congress: “జ్ఞానేశ్ కుమార్‌ను అమెరికాకు తీసుకెళ్లండి”.. ట్రంప్ ప్రశంసలపై కాంగ్రెస్ కౌంటర్..
-
Tamil Nadu: ‘ఆ చర్య సిగ్గుగా ఉంది’.. త్రిషకు సీఎం విజయ్ సెల్యూట్ చేయడంపై డీఎంకే ఆగ్రహం
-
Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
-
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
-
Vinod Tawde: యూపీ ఎన్నిలక కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్.. బరిలోకి దిగిన ‘‘సైలెంట్ స్ట్రాటజిస్ట్’’..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!