KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన నేరుగా మెయిన్ రోడ్లపై పడటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.
ఈ వన్ వే ప్రభావం రోడ్ నెంబర్ 12పై తీవ్రంగా పడింది. మసాబ్ ట్యాంక్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 12 వద్ద భారీగా ఇరుక్కుపోతున్నాయి. ప్రతినిత్యం ఆఫీసులకు వెళ్లే క్రమంలో సగం సమయం ఈ నరకప్రాయమైన ట్రాఫిక్‌లోనే సరిపోతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో బైక్‌లు అమితంగా హీట్ ఎక్కి, ద్విచక్రవాహనదారులు వాహనాలను పక్కకు నిలిపివేసి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అత్యవసర సేవలకూ ఈ రోడ్డు ఆంక్షలు తీవ్ర అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు వచ్చే రూట్లో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ముందుకు వెళ్లడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ మార్గమంతా వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు పోలీసులు వాహనాలను పూర్తిగా ఆపేస్తుండటంతో తెలంగాణ భవన్ వైపు వెళ్లాలంటే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ రూట్ మొత్తం రెండు వైపులా పూర్తిగా జామ్ కావడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కేవలం ఆఫీసులకు చేరుకోవడానికే రెండు గంటలకు పైగా పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!