సీఎం కెసిఆర్ రాజకీయ జీవితం సమాధి చేస్తామని….కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి భయపడేది లేదని… అధికారంలోకి వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పౌరుషం ఉంటే టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని… ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ను కేసీఆర్ మూడు ముక్కలు చేశారు, ఒక ముక్కను ఎంఐఎం కు ఇచ్చారని మండిపడ్డారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తాలేరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మూర్కుడు దేశ ప్రధాని అయితే స్వాతంత్ర్య దినోత్సవం తేదీ కూడా మారుస్తాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కి వస్తాం, కేసీఆర్ చరిత్ర ను భూ స్థాపితం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ నీచ చరిత్ర ను కూడా పాఠ్యంశంలో చేరుస్తామని… గొల్లకొండ ఖిల్లా పై కాషాయ జెండా ఎగుర వేస్తామన్నారు.