Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Cess Election Result

Bandi Sanjay: ఇంతదానికి ఎన్నికలెందుకు.. సెస్ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ఫైర్

Published Date :December 26, 2022 , 9:48 pm
By NTV WebDesk
Bandi Sanjay: ఇంతదానికి ఎన్నికలెందుకు.. సెస్ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay Fires On Cess Election Result: సెస్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెస్ ఎన్నికల ఫలితాల విషయంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఐదు స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ.. ఫలితాలను తారుమారు చేశారని వ్యాఖ్యానించారు. సెస్‌ను నాశనం చేసిన బీఆర్ఎస్‌కు ఓట్లు వేయలేదనే అక్కసుతో.. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తారా? అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ వాళ్లే ఓట్లేసుకొని, వాళ్లే ఫలితాలను ప్రకటించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంతదానికి ఎన్నికలెందుకు? ఫలితాలు ప్రకటించడమెందుకు? ప్రజల సమయాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమెందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉంది కదా ఇష్టానుసారం వ్యవహరిస్తారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నా.. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు చెల్లవని, ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tammineni Veerabhadram: బీఆర్ఎస్‌తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే

అంతకుముందు.. ప్రజా సంగ్రామ యాత్ర తర్వాత సీఎం కుటుంబంలో వణుకు మొదలైందన్నారు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలా అహంకారంగా, అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రంలాగా దేశం అభివృద్ధి చెందాలని మాయమాటలు చెబుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఎక్కడా ఇవ్వట్లేదని.. దాన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ రైతు ద్రోహి అంటూ నిప్పులు చెరిగిన బండి సంజయ్.. యూరియా సబ్సిడీ ఇస్తోందని కేంద్రమేనని తెలిపారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం మోడీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ దివాలా దీసి బీఆర్‌ఎస్‌ వచ్చిందని సెటైర్లు వేసిన ఆయన.. రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

పెళ్ళైన హీరోలతో నగ్మా ఎఫైర్లు.. లిస్ట్ పెద్దదే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • BRS vs BJP
  • Cess Election Result
  • cm kcr
  • Praja Sangrama Yatra

తాజావార్తలు

  • Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

  • Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

  • Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

  • Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

  • Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions