Bandi Sanjay: బీజేపీ సింహంలా సింగిల్‌గా వస్తుంది.. దమ్ముంటే పోటీ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: దారుస్సలాంలో కూర్చొని ఎంఐఎం ప్రేలాపనలు చేస్తోందని, దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని చంకలేసుకొస్తారో, కాంగ్రెస్ తో కలిసి వస్తారో రండి, బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుంది, ఎంఐఎంకి డిపాజిట్లు కూడా రానీయకుండా చేస్తాం అని అన్నారు. ఇన్నేల్లుగా పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేదని ఎంఐఎంని ప్రశ్నించారు. ముస్లిం యువకులకు పాస్ పోర్టు కూడా లేని పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేతకానీ పార్టీ అని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని ఆరోపించారు.
Read Also: Rahul Gandhi: ప్రధాని మోడీని దేవుడితో కూర్చోబెడితే.. దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందో వివరిస్తాడు..
Also Read
బీజేపీ నాగుపాము అని ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ చేసి వ్యాఖ్యలపై ఆయన బండి సంజయ్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పై ఎంఐఎంకు ఎందుకంత శ్రద్ధ, అసలు ఆ పార్టీకి అంతటా పోటీ చేసే దమ్ముందా..? దారుస్సలాంలో కూర్చోని బీరాలు పలికితే ఎవరూ పట్టించుకోరని.. నిజంగా జంగా ఎంఐఎంకు దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కర్ణాటకలో అంతా ఒక్కటయ్యారట.. ఇక్కడ కూడా గంట నక్కల పార్టీలు ఒకటవుతాయటని అన్నారు.
ఎంఐఎంను ముస్లింలు చీత్కరిస్తున్నారు. ఆ పార్టీని నమ్మడం లేదు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న నీ తమ్ముడి వ్యాఖ్యలకు జవాబు చెప్పు.? అని ప్రశ్నించారు. మీ ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తే ఉగ్రవాద నాయకుడు అని అన్నారు. వాళ్లకు షెల్టర్ ఇస్తూ ఆర్థిక సాయం చేసే పార్టీ నీదని ఆరోపించారు. టెర్రరిస్టులకు బెయిల్ ఇవ్వాలని వాదించిన పార్టీ నీదని విమర్శించారు. శంషాబాద్ లో ఓ వ్యాపారి అమిత్ షాకు ఇల్లు కట్టించారని, అమిత్ షా ఇక ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ కొట్టిపారేశారు. ప్రజా సంగ్రామ యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘బస్ యాత్ర, పాదయాత్రపై పార్టీలో అందరం కూర్చుని నిర్ణయం తీసుకుంటామే తప్ప ఏక్ నిరంజన్ పార్టీ కాదు’’అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!