Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు మరోసారి భారీ దోపిడీకి పాల్పడ్డారు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్నత పదవిలో పనిచేసి రిటైర్ అయిన ఓ అధికారిని బెదిరించి, కేటుగాళ్లు ఏకంగా రూ. 72.30 లక్షలు కాజేశారు. గచ్చిబౌలి ఖాజాగూడకు చెందిన రిటైర్డ్ ఓఈఎఫ్ (OEF) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుభాష్ కుమార్ ఆచార్య (69) ఈ సైబర్ వలలో చిక్కుకున్నారు. గత నెల 15న గుర్తుతెలియని వాట్సాప్ నంబర్ నుంచి ప్రదీప్ అనే వ్యక్తి కాల్ చేసి, సుభాష్ కుమార్ పేరుపై ముంబైలో కేసు నమోదైందని బెదిరించాడు. ‘డేటా బోర్డ్ ఆఫ్ ఇండియా’ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని భయపెట్టడమే కాకుండా, ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ పేరుతో నకిలీ ఆర్డర్లను కూడా పంపించి నమ్మించారు. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకూడదంటూ బాధితుడితో పాటు ఆయన భార్యతోనూ సైబర్ నేరగాళ్లు ఏకంగా ఒక హామీ పత్రం రాయించుకున్నారు.
ఆ తర్వాత మరో నేరస్తుడు ముంబై కొలాబా పోలీసు అధికారిగా వీడియో కాల్ చేసి, బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలను ఆరా తీసి పక్కా స్కెచ్ వేశాడు. బ్యాంకు లావాదేవీల పరిశీలన తర్వాత ఎటువంటి అక్రమాలు లేవని తేలితే డబ్బు తిరిగి వస్తుందని నమ్మించి, ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా విడతలవారీగా డబ్బులు బదిలీ చేయించుకున్నారు. కేటుగాళ్ల బెదిరింపులకు భయపడిన సుభాష్ కుమార్, చివరకు తన భార్య బంగారు ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుని మరీ వారి ఖాతాలకు జమ చేశారు. ఇలా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 5 మధ్య తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల బ్యాంకు ఖాతాలకు బాధితుడు మొత్తం రూ. 72.30 లక్షలు బదిలీ చేశారు. చివరకు ఈ నెల 11న తాను దారుణంగా మోసపోయినట్లు గ్రహించిన సుభాష్ కుమార్ ఆచార్య, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Hyderabad: "ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ".. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
- Hyderabad: కూకట్‌పల్లిలో భారీ సైబర్ మోసం.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 12.31 కోట్లు స్వాహా..
- Hyderabad: అర్ధరాత్రి నగరానికి చేరుకున్న రాహుల్ గాంధీ.. నేడు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ
- CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
తాజావార్తలు
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్‌లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
-
Hyderabad: కూకట్‌పల్లిలో భారీ సైబర్ మోసం.. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 12.31 కోట్లు స్వాహా..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!