Site icon NTV Telugu

Bandi Sanjay: కేటీఆర్‌కు “విత్ డ్రావల్ సిమ్టమ్స్”.. బండి ఫైర్..

Bandi Sanjay, Ktr

Bandi Sanjay, Ktr

Bandi Sanjay criticizes Minister KTR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ విత్ డ్రావల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తరువాత నా తల నరికినా..చెప్పుతో కొట్టినా.. ప్రజల కోసం భరించేందుక సిద్ధంగా ఉన్నానని అన్నారు. బీజేపీ అవినీతిపరుల భరతం పడుతుందని.. తిన్నదంతా కక్కిస్తుందని ఆయన అన్నారు.

Read Also: Disha Salian Death Case: ఆదిత్య ఠాక్రేకు బిగుస్తున్న ఉచ్చు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ మృతిపై సిట్ ఏర్పాటు

ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వడం చేతకాకే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు కేటీఆర్ బండి సంజయ్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టుకు నా వెంట్రుకలు, రక్తం, కిడ్నీలు ఇస్తానని, నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తానని.. కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా..? అని ప్రశ్నించారు. కరీంనగర్ కు ఏం చేయకుండా పిచ్చి అరుపులు అరుస్తున్నారని బండి సంజయ్ ని విమర్శించారు. వేములవాడ, కొండగట్టుకు నిధులు తెచ్చాడా..? అని ప్రశ్నించారు.

దీనిపై బుధవారం బండి సంజయ్ ప్రతిస్పందించారు. దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మెరిగినట్లుగా ఉంది కేటీఆర్ వ్యవహారం. కేటీఆర్ సోదరి కవిత ఎంపీని చెప్పుతో కొడుతా అంది.. ముఖ్యమంత్రి నన్ను ఆరు ముక్కలు చేస్తా అన్నాడు.. ఇప్పుడు మంత్రి చెప్పుతో కొడుతా అంటున్నాడు.. కుటుంబానికి ఎక్కువై మాట్లాడుతున్నారని బండిసంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయటపడిన తర్వాత ఎందుకు ఈ మాటలు మాట్లాడలేదని కేటీఆర్ ని ప్రశ్నించారు.

Exit mobile version