Bandi Sanjay : కేసీఆర్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
8 ఏళ్ల క్రితం నందినగర్ లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్ కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకయ్యే ఎన్నికల వేల కోట్ల నిధులిచ్చే స్థాయికి ఎట్లా చేరారు? ఇతర దేశాల నుండి నిధులొస్తున్నాయా? దేశం విచ్ఛిన్నం చేసేందుకు టెర్రరిస్టు సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా? తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు బూత్ స్వశక్తీరణ అభియాన్, ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి శాంతికుమార్, హైదరాబాద్ సెంట్రల్, రంగారెడ్డి అర్బల్, రూరల్, మేడ్చల్ అర్బన్, రూరల్, సికింద్రాబాద్- మహంకాళి, మలక్ పేట భాగ్యనగర్ జిల్లాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read : India VS China: అరుణాచల్‌లోని ప్రాంతాలకు చైనా పేర్లు.. డ్రాగన్ చర్యను తిరస్కరించిన భారత్
Also Read
- Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
- CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
- Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
- Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీ బూత్ స్వశక్తీ అభియాణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలో పోలింగ్ బూత్ కమిటీల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, దీంతోపాటు ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సమని, ఆరోజు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్నారని, తెలంగాణ అభివ్రుద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులిస్తోంది? ఏయే కార్యక్రమాలు చేపడుతుందనే అంశంపై మోదీ వివరణ ఇవ్వబోతున్నారన్నారు. కేంద్రం అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదనే అంశాన్ని వివరించబోతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Srirama Navami Wonder: శ్రీరామనవమి వేళ అద్భుతం.. ఆ ఇంట్లో వానరం సందడి
అంతేకాకుండా.. ‘ఆరోజు జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి విజయవంతం చేయాలి. రాజ్ దీప్ సర్దేశాయ్ బీజేపీ కాదు.. ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నింటికీ డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారు. ఆయనను కూటమికి ఛైర్మన్ ను చేస్తే.. ప్రతిపక్ష కూటమికి ఛైర్మన్ గా చేస్తే దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఎన్నికల కోసం ఖర్చయ్యే వేల కోట్ల నిధులిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని కేసీఆర్ చెప్పారు. ఇది నామాట కాదు.. దేశంలోని ఓ ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పారు. ఆయన బీజేపీ మనిషి కాదు. బీజేపీ బద్ద వ్యతిరేకి. ఆయనే ఈ మాట చెప్పారంటే పరిస్థితి ఎట్లుందో అర్ధం చేసుకోండి. 8 ఏళ్ల క్రితం నందినగర్ లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్ కు అసలు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే.
Also Read : Mumbai: లోకల్ ట్రైన్‌ను ఎక్కనివ్వనందుకు కోపం.. ప్రయాణికులు ఏం చేశారంటే..
ఇన్ని వేల కోట్లు ఖర్చు ఎలా సంపాదించారు? ప్రతిపక్ష పార్టీలకు ఖర్చు చేసే స్థాయికి ఎట్లా చేరారు ? కేసీఆర్ కు ఏ దేశం నుండి డబ్బులొచ్చాయి? టెర్రరిస్టు సంస్థలేమైనా నిధులిస్తున్నాయా? ఎందుకంటే చైనా, పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువ. వెంటనే కేసీఆర్ వేల కోట్ల ఆస్తులపై సంబంధిత ఏజెన్సీలు విచారణ జరపాలని కోరుతున్నా. బీజేపీ కార్యకర్తలారా…. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, బీజేపీని దెబ్బతీసేందుకు కేసీఆర్ దుష్ట, దుర్మార్గపు పన్నాగాలు చేస్తున్నారు. మనమంతా ఆ దుర్మార్గాలను ఎదుర్కొంటూ మోదీ నాయకత్వంలో శక్తివంతమైన దేశాన్ని రూపొందించాలంటే పార్టీ కార్యకర్తలు క్రుషి చేయాలి. అందులో భాగంగా బూత్ స్వశక్తీ అభియాన్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి. అట్లాగే ఈనెల 6న జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలతోపాటు 11న జ్యోతిరావు పూలె జయంతి, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలి.’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
ట్రెండింగ్
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?