NTV Telugu Site icon

Bandi Sanjay : రెండు పార్టీలు కలిసి పని చేస్తాయట.. పొత్తులపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Kcr Bandi Sanjay

Kcr Bandi Sanjay

జహీరాబాద్ వెళ్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సింహం సింగిల్ గా వస్తుంది… గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్‌ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో వెళ్తే బీఆర్ఎస్ మోడీని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 1400 మంది ఉసురు పోసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆయన ఆరోపించారు. నియంత పాలనతో కేసీఆర్ డిప్రెషన్ లోకి వెళ్లాడని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్‌.

Also Read : Akkineni Nagarjuna: ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?

శివరాత్రి పేరిట పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హంగూ ఆర్బాటాలు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు 1400 మంది ఉసురు పోసుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయట.. ఈ విషయం మేం చెప్పలేదు కాంగ్రెస్ ఎంపినే స్వయంగా చెప్పాడు అని ఆయన అన్నారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Ashwagandha : అశ్వగంధ పొడితో అనేక వ్యాధులకు చెక్‌