తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
మెదక్ జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో ఇటీవల సీఎం కేసీఆర్‌కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు.. రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్నారు కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతేకాకుండా వడ్లు వేయాల్సిన…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని…
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్‌ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని…