Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ‘జవాన్’ లాంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన.. నయనతార బ్రాండ్ ఇమేజ్ వేరు. అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉండేది. దీనిపై గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకు, ప్రమోషన్స్‌కు రాదని కొందరు విమర్శలు చేశారు. అయితే బెంగళూరులో జరిగిన యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేదికపై నయనతార స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది.
కెరీర్ ప్రారంభ రోజుల్లో పబ్లిక్ ఈవెంట్లలో ఎదురైన చేదు అనుభవాలు నయనతారను ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేలా చేశాయి. గతంలో ఆడియో వేడుకల్లో హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం, వేదికలపై కేవలం గ్లామర్ బొమ్మలుగా నిలబెట్టడం ఆమెను తీవ్రంగా బాధించింది. అంతేకాకుండా సినిమాల్లోని తమ పాత్రలు, కష్టం గురించి మాట్లాడకుండా… వ్యక్తిగత జీవితంపైనే మీడియా ఎక్కువ ఆసక్తి చూపడం, అసౌకర్యంగా ఫీలయ్యే ప్రశ్నలు అడగడంతో ఆమె డిఫెన్సివ్‌గా మారిపోయింది.
సాధారణంగా నటీనటులు ఇతరుల సినిమాలకు రాకపోయినా, తమ సొంత బ్యానర్ సినిమాలకు లేదా లీడ్ రోల్ చేసిన సినిమాలకు ప్రమోషన్లు చేస్తుంటారు. కానీ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఏర్పాటు చేసిన ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌పై ఎన్ని సినిమాలు నిర్మించినా, తన ప్రమోషన్ల విధానంలో ఎలాంటి మార్పూ లేదు. ‘మాయ’, ‘కనెక్ట్’ లాంటి చిత్రాల సమయంలో కూడా కేవలం కొన్ని ఎంపిక చేసిన మీడియా సంస్థలకు రికార్డెడ్ బైట్స్ మాత్రమే ఇచ్చింది. అయితే ఇండస్ట్రీలోని సత్సంబంధాలు, కొద్దిమంది ఆత్మీయుల కోసం నయనతార తన ‘నో-ప్రమోషన్’ రూల్‌ను పక్కన పెట్టింది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కోసం నటుడు యశ్ స్వయంగా ఫోన్ చేయడం, చిత్రంలోని తన పవర్ఫుల్ రోల్‌పై ఉన్న నమ్మకంతో బెంగళూరు ప్రమోషన్ ఈవెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘టాక్సిక్’ మాత్రమే కాదు… టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం కూడా నయనతార మరోసారి నో ప్రమోషన్ రూల్‌ని పక్కనపెట్టింది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లలోనే కాకుండా, గ్రాండ్ సక్సెస్ మీట్లోనూ నయనతార ప్రత్యక్షంగా పాల్గొనడం సినీ వర్గాలలో పెద్ద చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఆయన వ్యక్తిత్వం, అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కథలోని ఎమోషనల్ సీన్లను మలచిన తీరు ఆమెను కన్విన్స్ చేశాయి. అంతకుముందు చిరంజీవితో చేసిన ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల సమయంలోనూ ప్రత్యేక వీడియో బైట్స్‌తో సహకరించిన నయన్… ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం పూర్తిస్థాయిలో ప్రచార వేదికపైకి వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆడియన్స్‌ను మెప్పించే కంటెంట్ ఉన్నప్పుడు ప్రమోషన్ల హంగామా అక్కర్లేదని… కేవలం కొద్దిమంది డైరెక్టర్స్, హీరోల కోసం, స్పెషల్ మూవీ ప్రాజెక్ట్‌ల కోసం మాత్రమే తన రూల్‌ను మినహాయిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?