Dr. Laxman: భక్తులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. యాదాద్రిలో సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండి పడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండానే దేవాలయ దర్శనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దేవాలయ నిర్మాణంలో మొదట నుండి ఉన్న చిన్న జీయర్ స్వామి వారిని విస్మరించారని, గవర్నర్ ను గౌరవించడం మర్చిపోయారని డా.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు. మోదీజీ నేతృత్వంలో నేత్రుత్వంలో కేసీఆర్ పాలనను పెకిలించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దేశంలోనూ మరో 20 ఏళ్లపాటు మోదీ ప్రభుత్వం కొనసాగనుంది. కేటీఆర్..! తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2.52 లక్షలు కోట్లు ఇచ్చింది. ఆధారాలతోసహా వివరిస్తా.. రాజీనామా చేయడానికి సిద్దంగా ఉండాలని సవాల్ విసురుతున్నాం.
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
శ్రీలంకలో ఏ విధంగా అవినీతి, కుటుంబ పాలన కొనసాగడం వల్ల ఆ దేశ ప్రజలు బిచ్చమడిగే పరిస్థితి నెలకొందో…. కేసీఆర్ కుటుంబ అవినీతి-నియంత పాలనవల్ల తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొంది. తెలంగాణలో పేదల బతుకులు బాగుపడాలంటే.. అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. అందుకోసం బీజేపీ కార్యకర్తలంతా ఇష్టపడి, కష్టపడి పనిచేయండి. పార్టీ కోసం సమయం వెచ్చించండి. టీఆర్ఎస్ పునాదులు బద్దలు కొడదాం.. గొల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పనిచేద్దాం మని పిలుపు నిచ్చారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!