CM KCR: మెదక్, సూర్యాపేటలో సీఎం పర్యటన.. తేదీ ఖరారు చేసిన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి వారం నుంచి రెండు జిల్లాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశాల ద్వారా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు నెలాఖరులోగా మెదక్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా.. తన బహిరంగ సభల ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.
మెదక్ జిల్లాలో..
ఆగస్టు 19న మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సమావేశానికి ముందు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే గులాబీ అధినేత పాల్గొనే సభ నిర్వహణలో మెదక్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు.
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
సూర్యాపేట జిల్లాలో..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.. అనంతరం నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఇదే సందర్భంగా నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు ఆగస్టు 17 లేదా 18న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. తొలి జాబితాలో ఎమ్మెల్యే పేరు కూడా ఉండొచ్చని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని సమాచారం.
Sunday Good Luck Remedies: ఆదివారం నాడు ఈ చర్యలు చేస్తే.. వ్యాపారంలో విజయం! ఊహించని డబ్బు మీ సొంతం
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!