Revanth Reddy: రేవంత్‌పై చొప్పువిసిరే యత్నం.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొందరు వ్యక్తులు చెప్పులు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కొందరు అధికార పార్టీ నాయకులు ఆయనపై చెప్పులు విసిరేయత్నం చేయగా అక్కడే వున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారిద్దరు అధికార పార్టీకి చెందిన వారికిగా గుర్తించినట్లు సమచారం. ఈఘటన చోటుచేసుకోవడంతో కాసేపు ఆప్రాంతంలో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు నెలకొనలేదు.
Read also: Balakrishna Arrested: ఆత్మహత్య కేసు.. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అరెస్ట్..
Also Read
కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు ప్రారంభించారు. అయితే.. ములుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వనదేవతలు సమ్మక్క సారలమ్మల ప్రత్యేక పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రను సోమవారం నాడు ప్రారంభించారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర మహబూబాబాద్ కు చేరుకున్న క్రమంలో అక్కడ అధికార పార్టీ కార్యకర్తలు హల్ చల్ చేశారు. ఆయన పాదయాత్రను అడ్డుకునేందుకు నినాదాలు చేస్తూ.. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్రయత్నించిన వారు అధికార పార్టీ కార్యకర్తలని సమాచారం. రేవంత్ ప్రసంగిస్తున్న సమయంలో.. వీరు జై శంకర్ నాయక్ అంటూ నినాదాలు సైతం చేశారు. అయితే.. జై శంకరన్న, జై శంకరన్న అంటు నినాదాలు చేస్తున్న క్రమంలో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!