ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి ప్రాణంగా నిలిచే ‘ఎన్నికల అధికారి’గా రామ్ చరణ్ కనిపించేది.. ఈ స్టూడెంట్ లీడర్ తర్వాత వచ్చే చేంజ్ ఓవర్ లోనే. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది.
గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని మోకోబోట్ కెమెరాలో షూట్ చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, ఆ టైములో ఇండియన్ 2 రిలీజ్ అవుతుండడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమా సమ్మర్ నుంచి కూడా వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. పోస్ట్ సమ్మర్ లోనే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. గ్రాండ్ స్కేల్ లో ఒక భారీ ఈవెంట్ చేసి మరీ గేమ్ చేంజర్ టీజర్ ని ఆగస్ట్ 15న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి గ్లోబల్ స్టార్-క్రియేటివ్ డైరెక్టర్ కలిసి చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే టీజర్ రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.