Tamil Nadu: కూటి కోసం కోటి విద్యలు అన్నారు ఓ మహా కవి. అంటే పిడికెడు అన్నం కోసం మనిషి ఏ పనైనా చేస్తాడు. ఎందకంటే మనిషి మనుగడకు కావాల్సింది పిడికెడు అన్నం.. తలదాచుకోవడానికి జానెడు చోటు. దీని కోసం మనిషి అహర్నిశలు కష్టపడుతుంటాడు. కొన్ని పనులు ప్రమాదకరం అని తెలిసి ఆ పనులు చేయడానికి సిద్దపడుతుంటాడు. కొన్ని సార్లు ఆ పనులు ప్రాణాలు తీస్తుంటాయి. అలాంటి ఘటనే ప్రస్తతం తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. తమిళనాడు లోని అరియలూర్ జిల్లా వెరియూరు గ్రామంలో టపాసుల పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో ఎప్పటిలానే టపాసులు తరుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది.
Read also:Memory Power : మీరు జ్ఞాపకశక్తి పెంచుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..
పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు పరిశ్రమ లోపలే ఉన్నారు. కాగా పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 25 మంది మంటల్లో చుక్కుకున్నారు. కాగా వారిలో ఓ మహిళతో పాటు మొత్తం 5 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ధ్వంసం అయ్యాయి. కాగా పేలుడు సంభవించడానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడు దేనివల్ల సంభవించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.