Gaddar Party: ‘గద్దర్ ప్రజా పార్టీ’గా.. గద్దర్ కొత్త పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaddar Party: ఎన్నో ఏళ్లుగా విఫ్లవ రాజకీయాల్లో ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ ఇపుడు బ్యాలెట్ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని .. అదీ సీఎం కేసీఆర్‌పైనే పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాదిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని భావించి కేఏ పాల్ స్థాపించిన ప్రజా శాంతి పార్టీలో సైతం చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ప్రజా గాయకుడు గద్దర్ బుల్లెట్ మార్గాన్ని వదిలి బ్యాలెట్ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఆయన కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీని రిజిస్ర్టేషన్ చేయాలని భారత ఎన్నికల సంఘానికి బుధవారం ఆయన దరఖాస్తు సమర్పించారు. ప్రజా పాలన కోసం తన నేతృత్వంలో ”గద్దర్ ప్రజా పార్టీ”ని ఏర్పాటు చేస్తున్నట్టు గద్దర్(గుమ్మడి విఠల్) తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల సంఘంలో రిజిస్ర్టేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read also: Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పినట్టు బంగారు తెలంగాణ నిర్మితం కాలేదని, పుచ్చిపోయిన తెలంగాణ లా రాష్ట్రం పరిస్థితి తయారైందని గద్దర్ విమర్శించారు. ధరణి పేరుతో సీఎం భూములను మింగేశారని గద్దర్ ఆరోపించారు. దోపిడోళ్ల పార్టీని అధికారం నుంచి దింపేయాలన్న లక్ష్యంతోనే కొత్తపార్టీ పెడుతున్నట్టు చెప్పారు. ఐదేళ్లు అజ్ఞాతంలో గడిపిన తాను ఇప్పుడు పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని .. ఓటు యుద్ధంలో దేశాన్ని దోచుకుంటున్న వారిపై పోరాటడానికి, కోట్లాది మందిని కదిలించడానికి మళ్లీ ప్రజల్లోకి వచ్చానని గద్దర్ తెలిపారు. ప్రజాలారా నన్ను సాధుకున్నా.. చంపుకొన్న మీరే నని గద్దర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని.. ఎవరితో వెళ్ళాలి, ఎలా వెళ్లాలనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానని గతంలో గద్దర్ ప్రకటించిన విషయాన్ని విలేకరులు ప్రశ్నిచంగా.. ఆ రోజు తన వ్యక్తిగతమైన ప్రకటన చేశానని.. ఇప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. గద్దర్ ప్రజాపార్టీ జెండా మూడు రంగులతో ఉండనుందని.. అందులో పిడికిలి గుర్తు ఉంటుందని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్ ప్రధాన కార్యదర్శిగా నరేష్ పేర్లతో ఎన్నికల సంఘంలో రిజిస్ర్టేషన్ చేయించినట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!