Arepally Mohan : రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆరెపల్లి మోహన్ తోపాటు బీఆర్ఎస్ కు చెందిన స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులతోపాటు సుమారు 100 మంది ప్రజా ప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు సంజయ్ తో భేటీ అయిన ఆరెపల్లి మోహన్ తనతోపాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. మానకొండురుసహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా సర్వే నివేదికలను ఆధారంగా చేసుకుని అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందన్నారు.
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలున్నారని, వారందరిని కలుపుకుని పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరెపల్లి మోహన్ మానకొండూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలతోపాటు మండలాధ్యక్షులకు, జిల్లా నేతలకు ఫోన్లు చేసి బీజేపీలో తాను చేరుతున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆరెపల్లి మోహన్ అనుచరులు రెండ్రోజుల్లో మానకొండూరుకు ఆహ్వానించి భారీ ఎత్తున స్వాగత సత్కార సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో శుభ్‌మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
-
UP: ఇన్‌స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!