Youth Arrested: చోరీలు చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డ ఎపీకీ చెందిన యువకుడు
- పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో..
- ఈజీ మనీ కోసం చోరీ చేసిన యువకుడు
- హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో చోరీ
- సీసీపుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి చెందిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం తెలంగాణలో చోరీలు చేస్తూ పట్టుబడ్డాడు. అయితే నిందితుడు పోటీ పరీక్షలు రాసినా.. ఉద్యోగం రాకపోవడంతో.. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. అయితే సూర్యాపేట జిల్లాలోని వేపల సింగారంలో చోరీ చేసి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పీఎస్ కు తరలించారు.
Read Also: Suicide: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
పూర్తి వివరాల్లోకి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పెనుగొండ మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. కాంపీటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయినప్పటికి ఉద్యోగం రాలేదు. దీంతో జల్సాలు, ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడు. అయితే దొంగతనం చేసిన సొమ్ముతో బెట్టింగ్ ఆడి.. డబ్బులు పొగొట్టుకునే వాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారంలో దొంగతనానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ముడెం గోపిరెడ్డి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మల్లికార్జున్ రెడ్డి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుజూర్నగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:Electric Bike: హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్
చోరీ చేసిన సొమ్మును అమ్మేందుకు వెళుతుండగా.. అక్కడే వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో మల్లికార్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి నగదు, బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడి నుంచి 51.78 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,85,000 నగదు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!