OMC Case: సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆమెపై అభియాగం ఉండటంతో.. సీబీఐ కేసు నమోదు చేశారు. దీంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మీ జైలులోనే ఉన్నారు. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మీ వ్యవహరించారని ఆమెపై సీబీఐ అభియోగాలు మోపింది. సీబీఐ అభియెగాలను శ్రీలక్ష్మీ ఖండించినా.. ఈ విషయమై కోర్టు నుండి పై కోర్టు వరకు శ్రీలక్ష్మీ తన వాదనలను వినిపించారు. ఇండ్రస్టీయల్ సెక్రటరీగా తన పరిధి దాటకుండా వ్యవహరించారని శ్రీలక్ష్మీ తరుపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలను వినిపించారు. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఓఎంసీ వ్యవహారాలను చూశారని న్యాయవాదులు వినిపించారు. ఇక శ్రీలక్ష్మీ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా అయినాకూడా గాలి జనార్ధన్ రెడ్డికి మేలు కల్గించేలా వ్యవహరించారనే ఆరోపణనలను ఆమె ఎదుర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ వాదించింది. ఆరుమాసాలుగా ఉన్న లీజును మూడేళ్లను పొడిగించారని సీబీఐ హైకోర్టులో తన వాదనలను వినిపించింది. దీనిపై చార్జీషీటులో ఈఅంశాలను సీబీఐ ప్రస్తావించింది.
ఓఎంసీ కేసులో సీబీఐ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై దాఖలైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు నేడ(మంగళవారం) కొట్టివేసింది. ఓఎంసీకి మైనింగ్ లీజును కేటాయించిన సమయంలో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా లేరని ఆమె తరఫు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఓఎంసీ కేసును త్వరగా విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణను హైకోర్టు వేగవంతం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణపై కోర్టు దృష్టి కేంద్రీకరించింది.
Kunamneni Sambasiva Rao: తమిళి సై తెలంగాణను వీడాలి.. మోడీ రావొద్దు