Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరు, రివార్డ్ పాయింట్ల పేరుతో మరొకరు సైబర్ దాడికి గురై లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి భారీ మొత్తంలో మోసపోయామని గమనించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, షేర్ చాట్, వాట్సప్ లలో వచ్చే లింక్ లను పెట్టి అమాయక ప్రజల వద్దనుంచి లక్షల్లో సొమ్మును కాజేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో మోసపోయామని గ్రహించన బాధితులు లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే సంగారెడ్డిలో జరిగింది.
Read also: Sreeleela: క్యూట్ క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న శ్రీలీల…
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ఏషియన్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ సాప్ట్ వేర్ ఉద్యోగి. ఇన్ స్టా గ్రాం లో వచ్చిన మెసేజ్ కు స్పందించాడు. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మెసేజ్ రావడంతో లక్షలు వస్తాయని భావించాడు. అనిల్ ఆన్ లైన్ లో విడతల వారీగా పెట్టుబడి పెట్టడంతో ముందుగా లక్షా 10 వేలు లాభంగా ఇచ్చారు. దీంతో అత్యాశకి పోయిన అనిల్.. కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఇంకా డబ్బు వస్తాయని ఆశించాడు. వారు ఎలా చెప్తూ వెళ్లారో అలానే లింక్ లు షేర్ చేస్తూ పోయాడు. చివరకు సీన్ రివర్స్ అయ్యింది. తన వద్ద వున్న అకౌంట్ లో నుంచి రూ.11 లక్షల 84 వేలు పెట్టుబడి పెట్టేశాడు. అయితే మళ్లీ ఆ నెంబర్ కు కాల్ చేసిన, లింక్ ను క్లిక్ చేసిన స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన అనిల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.11 లక్షల 84 వేలు పోగొట్టుకున్నానని తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరాడు. ఎంతో కష్టపడి సంపాదిస్తే.. ఇలా మోసపోతానని అనుకోలేదని, దయచేసి సైబర్ ఫ్రాడ్ కు గురైన డబ్బును తిరిగి ఎలాగైనా ఇప్పించాలని కోరాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
T20 World Cup 2024: ప్రపంచకప్‌కు అతడిని సెలక్ట్ చేయండి.. బీసీసీఐకి షారుక్ ఖాన్ విజ్ఞప్తి!