T20 World Cup 2024: ప్రపంచకప్‌కు అతడిని సెలక్ట్ చేయండి.. బీసీసీఐకి షారుక్ ఖాన్ విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Wants to see Rinku Singh in India T20 World Cup 2024 Squad: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఇప్పటివరకు కూడా భారత జట్టుపై సరైన స్పష్టత లేదు. దాంతో జట్టులో చోటు ఎవరికి దక్కుతుంది?, ఎవరిపై వేటు పడుతుంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో బాలీవుడ్ బాద్ షా, కోల్‌కతా నైట్ రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్.. బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేశారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు యువ ఆటగాడు రింకూ సింగ్‌ను ఎంపిక చేయాలని షారుఖ్ ఖాన్ కోరారు. స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ… ‘అద్భుతమైన ప్లేయర్స్ దేశం కోసం ఆడుతున్నారు. రింకూ సింగ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. అందుకోసం ఎదురుచూస్తున్నా. ఇతర జట్లకు చెందిన మరికొందరు యువకులు కూడా జట్టులో భాగం కావాలి. చాలా మంది ప్లేయర్స్ ఇందుకు అర్హులు. కానీ రింకూ జట్టులో ఉండాలని ఆశిస్తున్నా. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. అది నాకు గొప్ప విషయం’ అని అన్నారు.
Also Read
Also Read: Shah Rukh Khan-Ganguly: సౌరవ్ గంగూలీని ఆశ్చర్యపరిచిన షారుఖ్.. వీడియో వైరల్!
‘కస్టపడి పైకి వచ్చిన వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కుర్రాళ్లు ఆడే సమయంలో నేను కూడా క్రీడాకారుడిగా గొప్ప అనుభూతి చెందుతుంటా. రింకూ సింగ్, నితీశ్ రాణా లాంటి ఆటగాళ్లలో నన్ను నేను చూసుకుంటా. వాళ్లు మంచి ప్రదర్శన చేస్తే ఎంతో సంతోషిస్తా’ అని షారుఖ్ ఖాన్ తెలిపారు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్‌లో అద్భుతమైన విజయం సాధించింది. 20వ ఓవర్‌లో రింకు వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో అతడు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సీజన్‌లో 474 పరుగులతో ఆకట్టుకున్న రింకూ.. టీమిండియాలోకి అరంగేట్రం చేసాడు. భారత్ తరఫున 15 టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలతో 356 రన్స్ చేశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024కు గట్టి పోటీ దారుడుగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!