Warangal Crime: వరంగల్ జిల్లాలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన యువతి కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రియురాలే చిత్రహింసలు పెట్టిందని బాధపడుతున్నాడు భర్త. దీంతో ఆ జంట విడాకులకు సిద్దమైంది. పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుంది జంట. ఏడాదిపాటు సాఫీసాగి సంసారంలో మనస్పర్థలతో గొడవలు జరిగాయి. కట్నంకోసం వేధిస్తున్నారని ప్రియురాలు ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు పనిలో పడ్డారు పోలీసులు.
కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధించడంతో హైదారబాద్‌లోని ఖానాపుర్ కు చెందిన నూర్జహాన్ స్వయంగా వాయిస్ రికార్డింగ్, వాట్సప్ లో వీడియోలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో వార్తకాస్త వైరల్ గా మారింది. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపింది. మరే అమ్మాయి ప్రేమ పేరుతో మోస పోవద్దని పేర్కొంది. ప్రేమపేరుతో పెళ్లి చేసుకున్న తనభర్త, అత్తమామలతో కలిసి తనకు నరకం చూపించాడని ఈవీడియోలో తెలిపింది. గీసుగొండ సమీపంలో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. అయితే భార్యే తనను నరకం చూపించిందని, విడాకులకు సిద్దమయ్యామని, భర్త ఆరోపించడంతో పోలీసులకు ఈవ్యవహారం తలనొప్పిగా మారింది.
CPI Narayana: మోటార్లకు మీటర్లు పెడితే.. వేళ్లు నరికేయండి