Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడంతో బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. భాను ప్రసాద్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అక్కడున్న విద్యార్థులు భాను గది తలుపులు కొట్టిన ఎంతసేపటికి తెరవక పోవడంతో గట్టిగా తలుపులు బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా భాను ఫ్యానుకు వేలాడుతుండటంతో షాక్ తిన్న విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. దీంతో యాజమాన్యం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భాను మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. విద్యార్థి మృతి నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థులంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట బైఠాయించారు. అధ్యాపకుల ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. భాను ప్రసాద్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మంచేల్ మండలం రంగాపూర్ గ్రామం.
Read also: Pushpa 2: ఆ స్టేజ్ పైన అయినా అప్డేట్ ఇస్తారా సర్?
భాను మృతదేహం చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. చదువుకుని మాకు అండగా ఉంటావనుకుంటూ కానరాని లోకానికి వెళ్లిపోయావా తండ్రీ అంటూ రోదించారు. అయితే భాను ఇలా ఎందుకు చేశాడనే విషయంపై యాజమాన్యం విచారిస్తుంది. అయితే భాను రాసిన సూసైడ్ నోట్ ఎన్టీవీ చేతికి చిక్కింది. అందులో ఏముందంటే..నా చావుకి నేనే కారణం.. నా మానసిక సమస్యలు కారణం అంటూ ఎన్నో సార్లు సూసైడ్ చేసుకుందామని అనిపించింది. చదువు పై విరక్తి తెప్పిస్తుంది. జీవితం పై విరక్తి కలిగింది. అమ్మా నన్ను క్షమించు.. అంటూ సూసైడ్ నోట్ లో భాను ప్రసాద్ రాయడంతో తన సూసైడ్ ఎందుకు చేసుకున్నాడో అసలు కథ వెలుగులోకి వచ్చింది. సూసైడ్ నోట్ ను కో-ఆర్డినేషన్ కు పంపించినట్లు సమాచారం. OCD సమస్య ఉందని నోట్ లో విద్యార్ధి రాసినట్లు సమచారం. భాను మృతితో కాలేజీ వాతావరణం అంతా ఒక్కసారిగా శోకసముద్రంలోకి వెళ్లిపోయింది.
Read also:Bridge Collapses: బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే ఇలా..
బాసర ట్రిపుల్ ఐటీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. వసతులు సరిగా లేవని కొద్దిరోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు. ఇలా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఈ పరిణామాలతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు.తమ పిల్లలు చదువుకుని బాగుపడతారని తల్లిదండ్రులు ఆశపడుతుంటే.. అక్కడ జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి.
Tension at Midthur Police Station: మిడుతూరులో ఉద్రిక్తత.. పీఎస్‌పై దాడి..! 14 మందిపై కేసు