జూలై నాటికి హైదరాబాద్‌లో మరో ఫైఓవర్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్-ఎల్బి నగర్ రహదారిపై చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ సమస్య ఈ జూలై నాటికి తీరనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నాగోల్ వద్ద ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్‌ను నిర్మించడంతో త్వరలో చరిత్రగా మారనుంది. 67.97 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్లైఓవర్ ప్రారంభించిన తర్వాత ఉప్పల్ నుండి వచ్చే ట్రాఫిక్, నాగోల్ మీదుగా ఎల్బీ నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్, ఎల్బీ నగర్ నుండి నాగోల్ మీదుగా ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్ చాలా సాఫీగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) కింద ఈ ఫ్లైఓవర్ 990 మీటర్ల పొడవు మరియు 24 మీటర్ల వెడల్పుతో నిర్మించబడింది.
జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం.. ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు ఉప్పల్- ఎల్బీ నగర్ స్ట్రెచ్‌లో సాఫీగా ప్రయాణించడంతో పాటు తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. ఫ్లైఓవర్ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) ప్రకారం.. ఈ సౌకర్యంతో ప్రయాణ వేగాన్ని పెంచడమే కాకుండా, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రహదారి వినియోగదారులకు భద్రత మరియు సేవా స్థాయిని పెంచుతుంది. కొన్నేళ్లుగా ఎల్బీ నగర్ జనసంద్రంగా మారిందని, అనేక నివాస సముదాయాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, ఫలితంగా ట్రాఫిక్ రద్దీ పెరిగిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. దానికి తోడు ఎల్బీ నగర్ జంక్షన్ భారీ ట్రాఫిక్‌ను చూసే కనెక్టింగ్ రోడ్లతో విజయవాడకు వెళ్లే ప్రజలకు ప్రధాన ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లలో కూడా ఒకటి.
Also Read
ఎల్బీ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, రూ.448 కోట్ల అంచనా వ్యయంతో 14 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వాటిలో, చింతలకుంట చెక్‌పోస్ట్ జంక్షన్ అండర్‌పాస్, ఎల్బి నగర్ కుడి వైపు (ఆర్హెచ్ఎస్) అండర్‌పాస్ ఇప్పటికే ఉన్న కామినేని ఎడమ వైపు (ఎల్హెచ్ఎస్) ఫ్లైఓవర్, ఎల్బి నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవర్, కామినేని ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్‌తో పాటు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!