Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant About Six With Century: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్ గడ్డపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. వెలింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 128 రన్స్ చేశాడు. తన ఇన్నింగ్స్‌పై మ్యాచ్ అనంతరం మాట్లాడిన పంత్.. ఈ సెంచరీ తనకు ప్రత్యేకమని చెప్పాడు. న్యూజిలాండ్‌లో శతకం సాధించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయాలంటే క్రీజులో ఎక్కువసేపు నిలబడాల్సి ఉంటుందని తెలిపాడు. పిచ్‌పై అందరూ బాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాను కూడా వీలైనంత ఎక్కువ సమయం క్రీజులో ఉండి జట్టుకు తన వంతు సహాయం అందించాలనుకున్నానని చెప్పాడు. అందుకే తొందరపడకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడినట్లు పంత్ వివరించాడు.
బ్యాటింగ్‌లో షాట్లు ఆడాలని ముందుగానే నిర్ణయించుకుంటారా? అన్న ప్రశ్నకు పంత్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ‘సాధారణంగా బౌలర్ ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. ఎక్కువగా ముందస్తు ప్రణాళికలతో ఆడను. బంతి నా పరిధిలోకి వస్తే బౌండరీకి తరలించేందుకు ప్రయత్నిస్తా. నా బ్యాటింగ్ విధానం చాలా సరళంగా ఉంటుంది. సెంచరీని సిక్స్‌తో పూర్తి చేయాలన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అయితే ఈ ప్రయత్నంలో గతంలో చాలాసార్లు బౌలర్‌కి దొరికి సెంచరీలు చేజార్చుకున్నా. ఈసారి మాత్రం తొందరపడకుండా ఓపికగా ఎదురుచూశా. మిడ్ఆఫ్ ఫీల్డర్ ముందుకు రావడంతో సిక్స్ కొట్టడానికి ఇదే సరైన అవకాశమని భావించా. సిక్స్‌తో సెంచరీ కొట్టా’ అని వివరించాడు.
Also Read
- IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
- IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
- Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
- Tom Latham Record: బుమ్రా దెబ్బ.. కివీస్ కెప్టెన్ ఖాతాలో చెత్త రికార్డు.. సెహ్వాగ్‌ను దాటేశాడు!
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెకల్లమ్‌ను అధిగమించడంపై పంత్ స్పందిస్తూ.. ‘చిన్నతనంలో ఎక్కువ సిక్సర్లు కొట్టాలనే లక్ష్యాలు ఉండేవి. అయితే ప్రస్తుతం వ్యక్తిగత రికార్డుల కంటే నిలకడగా రాణించడం, నేను ఆడే ప్రతి మ్యాచ్‌లో జట్టుకు ఉపయోగపడటమే నా టార్గెట్. మైదానంలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా ఎంతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతా. మైదానంలో ఉండటమే నాకు సంతోషాన్నిస్తుంది. ప్రతిరోజూ ఆటను ఆస్వాదిస్తా. టెస్టు క్రికెట్లో ప్రతిరోజూ అనుకూలమైన పిచ్‌లు ఉండవు. కొన్నిసార్లు ఓపికగా కష్టపడాల్సి ఉంటుంది. జట్టుగా మైదానంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, సరదాగా గడుపుతూ, ప్రతి రోజూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
ట్రెండింగ్
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!