HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA: హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కు చెరువు పునరుద్ధరణపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పార్కులో దాదాపు గంటపాటు మార్నింగ్ వాకింగ్ చేస్తూ వాకర్స్, సందర్శకులతో ముఖాముఖి మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి పరిరక్షణతో పాటు చెరువు, పార్కు సమగ్ర అభివృద్ధిపై వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు.
ప్రస్తుతం 3 ఎకరాలకు మాత్రమే పరిమితమైన కృష్ణకాంత్ పార్కు చెరువును 12 ఎకరాలకు విస్తరిస్తూ పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేసింది. చెరువు లోతును పెంచి భారీగా వరదనీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వరదనీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్లెట్లను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటిని కృష్ణకాంత్ పార్కు చెరువుకు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్‌పేట, మైత్రివనం తదితర లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పును గణనీయంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
- IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
- December 2026 Wedding Dates: డిసెంబర్లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్
- Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
ఈ పర్యటనలో వాకర్స్ పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్కు దక్షిణం వైపు ఉన్న చెత్త డంపింగ్ యార్డు కారణంగా తీవ్ర దుర్వాసన వస్తోందని, అలాగే సరైన ప్రహరీ గోడ లేకపోవడంతో చెత్తాచెదారం పార్కులోకి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులోని పాడైన జిమ్ పరికరాలను వెంటనే మరమ్మతు చేయాలని కోరారు. తమ్మిడికుంట తరహాలో కృష్ణకాంత్ పార్కులోనూ ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, చెరువుతో పాటు పార్కును కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని వాకర్స్ విజ్ఞప్తి చేశారు. నగరంలో హైడ్రా ఇప్పటికే పునరుద్ధరించిన చెరువుల అభివృద్ధి తీరును ఈ సందర్భంగా వాకర్స్ ప్రశంసించారు.
తాజావార్తలు
-
HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
-
Rashmika-Mysaa: రష్మిక అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ‘మైసా’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
-
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
ట్రెండింగ్
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ