Indira Canteen : అన్నపూర్ణ కేంద్రాలకు పేరు మార్పు.. ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’గా
- అన్నపూర్ణ భోజన కేంద్రాలకు ‘ఇందిరా క్యాంటీన్లు’గా కొత్త పేరు
- ఉదయం బ్రేక్‌ఫాస్ట్, శాశ్వత భవనాలు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- ఇప్పటివరకు పేదలకు 10 కోట్ల భోజనాలు అందించిన క్యాంటీన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indira Canteen : హైదరాబాద్ నగరంలోని రూ.5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఇవి ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా పిలవబడ్డాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఈ భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి “అన్నపూర్ణ” పేరుతో ప్రజలకు వినియోగంలో ఉన్నాయి.
Karnataka: దారుణం.. వన్యప్రాణులపై విషప్రయోగం.. 5 పులులు మృతి
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేంద్రాల సంఖ్యను విస్తరించినప్పటికీ, పేరును మాత్రం మార్పు చేయలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, ఈ కేంద్రాలకు ఇందిరా గాంధీ పేరిట ‘ఇందిరా క్యాంటీన్లు’గా పునర్నామకరణ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి మాత్రమే ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. త్వరలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా రూ.5కే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూనూ తిరిగి డిజైన్ చేస్తున్నారు — ప్రతి ప్లేట్లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల ఊరగాయను సమతుల్యంగా చేర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇకపై ఈ కేంద్రాలను తాత్కాలిక షెడ్ల నుంచి శాశ్వత కట్టడాలుగా మార్చే పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలు తుప్పుపట్టిన షెడ్‌ల్లో, శిథిలావస్థలో ఉన్న గదుల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తీసుకుంది. అందులో పేర్కొన్న సూచనల ఆధారంగా పునః నిర్మాణ చర్యలు చేపట్టనున్నారు.
భవిష్యత్తులో కొత్త క్యాంటీన్లను కూడా ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్న GHMC, భోజనం తినేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లను ఏర్పాటు చేయాలన్న యోచనలో కూడా ఉంది. ఇప్పటివరకు ఈ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా దాదాపు 10 కోట్ల భోజనాలు పేదలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆకలితో ఉన్న ప్రజలకు ఈ క్యాంటీన్లు పెద్ద ఆశ్రయంగా నిలిచినట్లు గుర్తు చేశారు.
YS Jagan: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!