Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
- రాహుల్ గాంధీపై అమిత్ షా ఘాటు విమర్శలు
- ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి
- రేవంత్ సీఎం కావడంపైనా వ్యంగ్యాస్త్రాలు
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పుడల్లా ఈవీఎంలను, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను తప్పుపట్టడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అసలైన ప్రధాని కాలేని రాహుల్ గాంధీ.. కనీసం తాను నిర్వహించిన నకిలీ ‘మాక్ పార్లమెంట్’లోనైనా ప్రధాని అయ్యి ఉంటే సోనియా గాంధీ మనసుకు కాస్త శాంతి దక్కేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి విదేశాలకు పారిపోయే వారు ప్రజాక్షేత్రంలో గెలవలేరని, చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాదు కానీ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పాలని హితవు పలికారు.
ఈవీఎంల టార్గెట్.. తెలంగాణ సీఎం రేవంత్‌పై అమిత్ షా ప్రశ్న
ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఉందని అమిత్ షా విమర్శించారు. ఈవీఎంలు నిజంగానే చెడ్డవైతే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని నిలదీశారు. అలాగే కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు ఎలా విజయం సాధించాయని ప్రశ్నించారు. ఈవీఎంలపై రాహుల్ గాంధీకి అంతగా అనుమానం ఉంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయకుండా నిరోధించాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈవీఎంలు, ఎస్ఐఆర్, చొరబాటుదారుల అంశాలపై చర్చించేందుకు తాము ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకైనా సిద్ధమని సవాల్ విసిరారు. పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రధాని మోదీ ధాటికి సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ అరాచకాలను సృష్టిస్తోందని మండిపడ్డారు.
Also Read
- Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
- Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
- Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
- Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల విజయాలు ఎస్ఐఆర్ వల్లేనా?
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చిన అమిత్ షా.. 2014, 2019 ఎన్నికల సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియే జరగలేదని, కేవలం దేశ ప్రజల ఆశీర్వాదంతోనే నరేంద్ర మోదీ ఘనవిజయం సాధించారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానాలలో, అలాగే ఏళ్ల తరబడి పట్టు లేని ప్రాంతాల్లోనూ బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించిందని, పశ్చిమ బెంగాల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి ఓట్లను, మూడు కోట్ల మంది మృతి చెందిన వారి ఓట్లను, అలాగే మరో కోటి డూప్లికేట్ ఓట్లను తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి కడుపుమంటగా ఉంటోందని విమర్శించారు. చొరబాటుదారులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని, ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినా వారి ఆటలు సాగవని హెచ్చరించారు.
పదేళ్ల కాంగ్రెస్ అవినీతి వర్సెస్ మోదీ సుపరిపాలన
కాంగ్రెస్ హయాంలోని పదేళ్ల పాలనలో రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు, అవినీతి జరిగాయని అమిత్ షా ఆరోపించారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో ఆయనపై నయా పైసా అవినీతి ఆరోపణ కూడా రాలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అపారమైన ప్రజాదరణ ముందు రాహుల్ గాంధీ ఎక్కడా సరితూగరని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీ వెంటే ప్రజలు ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!