Amith Shah: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి బీటీం పార్టీ.. అని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా మండిపడ్డారు. మక్తల్ పట్టణ కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ బహిరంగ సభకు అమిత్ షా మాట్లాడుతూ.. 10 సంవత్సరాలుగా అవినీతితో కురుక పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు పడకల గదిని, డిగ్రీ కళాశాల,నిరుద్యోగ యువతకు 3000 రూపాయలు వంటివి ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మట్టి దందా,ఇసుక దందాలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ నీ ముఖ్యమంత్రి నీ చేస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నీ ప్రధాన మంత్రిని చేసినట్టు అవుతుందన్నారు.
Read also: Arvind Kejriwal: ఫస్ట్ టైం తనతో లేనందుకు బాధపడ్డ అరవింద్ కేజ్రివాల్
కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి బీటీం పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. భీమా ప్రాజెక్ట్ పెండింగ్ లో వున్న పనులను పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం 4 శాతం రద్దు చేసి OBC లకు రిజర్వేషన్ పెంచుతామన్నారు. బీద మహిళలకు 4 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వము ఒక్క బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినం నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే శ్రీరాముని దర్శనం ఉచితంగా ఇస్తామన్నారు. మళ్ళీ ప్రధానిగా మోడీని చేద్దామని ప్రజలకు కోరారు.
TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!