Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. షెడ్యూల్ ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి హెలికాప్టర్లో సిద్దిపేటకు చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది. ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది. ఇక.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Read also: Double Ismart : షూటింగ్ ఆలస్యం..అసలు ఏమైంది మావ..?
బీజేపీ కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలిసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్లు, వివిధ కుల సంఘాలు, యువకులు, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యం. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సమయంలో మాత్రమే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను స్వయంగా కలవడం, కార్నర్ మీటింగ్‌లు వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా మిగిలిన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం, కరపత్రాలు, ప్రచార స్టిక్కర్లు, పార్టీ జెండాలు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రాలు అందజేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఓటర్లకు అందిస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండో విడత ప్రచారం, వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో మూడో విడత ప్రచారం పూర్తి కానుంది.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా రహస్యంగా బాలిస్టిక్ క్షిపణులు.. రష్యా ఉక్కు ఫ్యాక్టరీపై దాడి
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?