టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..ఈ సినిమాను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది .ఈ మూవీ కోసం హీరో రామ్ డిఫరెంట్ లుక్ లో కమీపించబోతున్నాడు .డబుల్ ఇస్మార్ట్ మూవీ సక్సెస్ హీరో రామ్ కు మరియు దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఎంతో ముఖ్యం .ప్రస్తుతం వీరిద్దరూ వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు .ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి ,రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..కానీ ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ వీరిద్దరికి ఎక్కువ కాలం నిలవలేదు .
ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత రామ్ చేసిన ప్రతి సినిమా అంతగా ఆకట్టుకోలేదు .అలాగే దర్శకుడు పూరీజగన్నాధ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నారు .దీనితో వీరిద్దరి కెరీర్ కు డబుల్ ఇస్మార్ట్ మూవీ కీలకంగా మారింది.అయితే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం .హీరో రామ్ అధిక రెమ్యూనరేషన్ అడగడం వలనే షూటింగ్ ఆగిందని కొన్ని పుకార్లు ప్రచారం జరిగాయి.అయితే అందులో నిజం లేదని తెలిసింది .ఈ సినిమా కోసం హీరో రామ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోనున్నట్లు సమాచారం .ఈ సినిమాను ఛార్మి కౌర్ తో కలిసి దర్శకుడు పూరి నిర్మిస్తున్నాడు .ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు ఇప్పుడు కాస్త ఆర్ధిక ఇబ్బందులు రావడంతో షూటింగ్ నిలిచిపోయినట్లు తెలుస్తుంది .త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.