అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వేళ దేశ వ్యాప్తంగా ప్రజలు బాలరాముడిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఎక్కడ విన్నా రామ నామం ఒక్కటే వినిపిస్తుంది.. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. అలా బంగారు భవ్యరామ మందిరాన్ని రూపొందించాడు ఓ కళాకారుడు.. ఆ మందిరం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి.. ఆ కళాకారుడు తయారు చేసిన రామ మందిరం.. 1.5 సెంమీ ఎత్తు, 1.75 సెంమీ వెడల్పు, 2.75 సెంమీ పొడవుతో భవ్య రామమందిర ఆలయాన్ని 2.730 మిల్లి గ్రాముల బంగారంతో తయారు చేశాడు. గోపి రూపొందించిన గోరంత రామ మందిరంలో 20గోపురాలు, 108స్థంబాలు, ప్రత్యేకంగా విల్లును తయారు చేశాడు.. అతని ప్రతిభను చూసిన ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అంత అద్భుతంగా చేశారు..
ఈయన ఆమధ్య t 20 కి సంబందించిన వరల్డ్ కప్ ను కూడా గోరంత సైజులో తయారు చేసి రికార్డు సృష్టించారు..సూక్ష్మ జాతీయ జెండా, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో పాటు ఎన్నో వస్తువులను రూపొందించాడు. భవిష్యత్ లో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనాలను తయారు చేస్తానని గోపి చెబుతున్నాడు.. ప్రభుత్వం సాయం, సహకారాలను అందిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు..