MLA Laxma Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కొన్ని పార్టీలు పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాయి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరు గ్రామస్తులంతా అభివృద్ధికి పట్టం కట్టేందుకు నడుం బిగించారు. మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదన్నారు. మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే అని అన్నారు. మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే అంటూ ఆలూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. గత 9 ఏళ్లలో తమ గ్రామంతో పాటు మండలం, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అర్హులకు మంచిగా అందుతున్నాయని అన్నారు. అందుకే తామంతా బీఆర్ఎస్ పార్టీకే మరోసారి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇతర పార్టీల వారు తమ గ్రామంలో ప్రచారం చేసిన దండగే అని మంచి చేస్తున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామస్తులు అభివృద్ధికి పట్టం కట్టారు. మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదని.. మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే అని కుర్వగడ్డపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే ” అంటూ ప్రచారం చేపట్టారు. గత 9 ఏళ్లలో తమ గ్రామంతో పాటు మండలం, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అర్హులకు మంచిగా అందుతున్నాయని అన్నారు. అందుకే తామంతా బిఆర్ఎస్ పార్టీకే మరోసారి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇతర పార్టీల వారు తమ గ్రామంలో ప్రచారం చేసిన దండగే అని మంచి చేస్తున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభివృద్ధిపై ఫెక్సీని ఏర్పాటు చేసి, సభలో ఆయన చేసిన అభివృద్ధిని తెలుపుతూ బీఆర్ఎస్ కే మా ఓట్లన్నీ అని తెలిపారు.
Virat Kohli Birthday: బర్త్ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!