2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్‌వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్‌లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్‌వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్‌వేర్‌ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది.
Read: ప్రియమైన లోదుస్తుల బ్రాండ్ కి… ఇక పై ప్రియాంక మాట సాయం!
జోకర్ మాల్‌వేర్ వలన లక్షలాదిమంది తన డబ్బును కోల్పోయారు. అయితే, మరలా ఈ జోకర్ దేశంలోకి ప్రవేశించినట్టు మహారాష్ట్ర పోలీసులు గుర్తించి దేశాన్ని అలర్ట్ చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు సైతం ఈ మాల్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్‌లో 8 రకాల జోకర్ మాల్‌వేర్ యాప్ లు ఉన్నట్టుగా సైబర్ సెక్యూరిటీస్ సంస్థ క్విక్‌హిల్ పేర్కొన్నది. ఈ జోకర్ మాల్‌వేర్ ఉన్న యాప్‌లు దాదాపుగా 50వేలకు పైగా డౌన్‌లోడ్‌లు జరిగినట్టు తెలియజేసింది.