2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్‌వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్‌లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్‌వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్‌వేర్‌ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …