TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీక్ కేసు దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి ChatGPTని ఉపయోగించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నేడు రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష OMR విధానంలో మాత్రమే నిర్వహించబడుతుంది. పేపర్-1 పరీక్ష 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఏఈఈ పోస్టుల రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పావుగంట ముందుగానే గేట్లు క్లోజ్ చేయనున్నారు అధికారులు. ఒక్కనిమిషం ఆలస్యమైన లోనికి అనుమంతబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించాలని రాత పరీక్షలు ముందుగానే చేరుకోవాలని కోరారు.