Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి గాంధీభవన్ సమీపంలో నాలుగు కార్లు దగ్ధమయ్యాయి. పార్క్ చేసిన కారులో మంటలు చెలరేగడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కార్ లో నుండి మంటలు నిమిషాల్లో వ్యాపించినట్లుగా సమాచారం. ఒక కారునుండి మరో అయిదు కార్లకు మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎక్జిబిషన్ లో వున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో.. అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీకెండ్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఈ ప్రదర్శనను సందర్శిస్తారు.
Read also: Umesh Yadav: టీమిండియా క్రికెటర్‌కు షాక్.. రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు
2019లో నుమాయిష్‌లో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ. 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధిత వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 35 వేలు చెల్లించిన విషయం తెలిసిందే. అయితే ఇవాలా ఎగ్జిబిషన్ పార్కింగ్ లో మంటల చలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సికింద్రాబాద్ ఘటన మరువక ముందే మళ్లీ నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Assembly Sessions: ఫిబ్రవరి 3 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు