Nagoba Jatara: నాగోబా ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- ఆదిలాబాద్ లోని కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర..
- నాగోబా జాతర ను ప్రారంభించిన మెస్రం వంశీయులు..
- నాగోబా దర్శనం కోసం భారీగా తరలి వచ్చిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఘనంగా నాగోబా జాతర కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుషులు కలిసికట్టుగా కాలినడకన వెళ్లి నాగోబా ప్రతిమను ఊరేగిస్తూ సంప్రదాయ వాయిద్యాల మధ్య ఆలయానికి తీసుకెళ్లారు. ఇక, ఆలయానికి చేరుకున్న తర్వాత మెస్రం వంశీయులు తమ సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. మొదటగా మెస్రం పెద్దలు 22 కితల్లోని మహిళలు, ఆడపడుచులకు కొత్త కుండలను ఇవ్వగా.. ఆడపడుచులు, మహిళలు, అల్లుళ్లు కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ వెళ్లి కోనేరు దగ్గర ఉన్న జలాన్ని సేకరించి అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత నాగోబా ఆలయంలోని బౌల సతీ దేవత ముందు ఏడు వరుసలతో తయారు చేసిన దేవతామూర్తులను ప్రతిష్టించారు.
Read Also: Pragya Jaiswal: బాలకృష్ణతో వరుస ఆఫర్లపై ప్రజ్ఞా జైస్వాల్ వైరల్ కామెంట్స్..
Also Read
ఇక, మంగళవారం నాడు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య నాగోబాకు మహాపూజ చేశారు. దీంతో ఈరోజు ఉదయం నుంచి సంప్రదాయ పూజలతో నాగోబా జాతరను మొదలు పెట్టారు. అయితే, జాతర ప్రారంభం కావడంతో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, ఏపీలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో, అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు కావాల్సిన కనీస వసతులను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఇక, ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్ లో జనవరి 31వ తేదీన జరగనుంది.. దీనికి మంత్రులు సీతక్క, కొండ సురేఖతో పాటు జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు హాజరు అవుతారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!