హాట్ బ్యూటి ప్రజ్ఞా జైస్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే తక్కువ సినిమాలు చేసినప్పటికి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోలతో నటించడంతో ఫేమ్ పెరిగిపోయింది. తాజాగా ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకులను పలకరించిన బాలకృష్ణ భారీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రజ్ఞా జైస్వాల్. గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ.. బాలయ్య తో వరుస సినిమాల గురించి ఆమె స్పందించారు.
Also Read:Rashmika: రిలేషన్షిప్ ను కన్ఫామ్ చేసిన రష్మిక
ప్రజ్ఞా మాట్లాడుతూ.. ‘ ‘డాకు మహారాజ్’ విజయంతో నా ఈ కొత్త ఏడాది అద్భుతంగా ప్రారంభమైందని భావిస్తున్నాను. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.‘డాకు మహారాజ్’ విడుదలైన దగ్గర నుంచి నన్ను అందరూ డాకు మహారాణి.. అని పిలుస్తున్నారు. ఈ కావేరి పాత్ర అంత ప్రభావితం చూపింది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన. ముఖ్యంగా ఇందులో గర్భిణీ పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేను చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. ఇక బాలయ్య సార్ గురించి చెప్పాలంటే ఆయన పేరు చెప్పగానే పాజిటివిటి పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. చాలా మంచి మనిషి. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. అంతేగాని వారి వయసు ఆధారంగా సినిమా అవకాశాలు ఇవ్వరు. నాకు ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేశానా, లేదా.. అని ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది ఒక సమస్య కాదు ‘అఖండ’ విడుదలైన తర్వాత మా ఇద్దరినీ స్క్రీన్ ప్లే చూసి ఆశ్చర్యపోయాను’ అని చెప్పుకొచ్చింది ప్రజ్ఞా.