NTV Telugu Site icon

KA Paul: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ka Paul

Ka Paul

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ ఓట్లు మీకే వేసుకోండని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాను సీఎం అవుతానన్నారు. తన సత్తా ఏంటో ఇప్పుడున్న వాళ్లకు తెలుసని కేఏ పాల్ తెలిపారు. ఇప్పుడున్న వాళ్ళు వందల కోట్లు ఖర్చుపెట్టి లక్షల కోట్లు దోచుకున్నారు.. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఆయన మాటలతో వందల మందిని బలి చేశారని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీలు వేరే పార్టీ తరఫున పోటీ చేయకండి.. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవం చేసుకోండని సూచించారు.

Read Also: Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తోజాయింట్‌ వెంచర్‌కు గుడ్ బై..

చాలా మంది కులాన్ని వాడుకొని పార్టీలు లాభం పొందారు.. బీసీలను రెండు మూడు కులాల వారు అనగదొక్కారని కేఏ పాల్ తెలిపారు. రెడ్డిలు 12 మంది సీఎంలు అయ్యారని అన్నారు. కేసీఆర్ పేరు మీద లేదా పార్టీ మీద పోటీ చేద్దామనుకునే వారు వారికంటే దరిద్రులు ఇంకా ఎవరు లేరని చెప్పారు. కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారని కేఏ పాల్ వెల్లడించారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కేఏ పాల్ కౌంటర్ ఇచ్చారు. పూలమ్మి.. పాలమ్మి అంత సంపాదించారా అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. హైడ్రా పెద్ద డ్రామా అని ఆరోపించారు. రేవంత్, కేసీఆర్ తోడు దొంగలు అని దుయ్యబట్టారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం పెద్ద డ్రామానేనని కేఏ పాల్ అన్నారు.

Read Also: Kejriwal Vs LG: అతిషిని తాత్కాలిక సీఎం అనడంపై వీకే.సక్సేనా అభ్యంతరం.. సీఎంకు లేఖ

మరోవైపు.. అల్లు అర్జున్ ఎవరో తనకు తెలియదని.. ఆయన పేరు కూడా తెలియదన్నారు. చిరంజీవి, కృష్ణ తెలుసని చెప్పారు. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్‌ను థియేటర్ లోపలికి ఎందుకు పంపారు.. ఆ హత్యలు మీకు భాగం లేదా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రజాశాంతి కండువాలు కప్పుకోవాలి.. తన ఫోటో పెట్టుకుని తిరగండని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా గెలవండని కేఏ పాల్ తెలిపారు. రూ. 10 పెట్టి ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం తీసుకోండని ప్రజలకు చెప్పారు.

Show comments