NTV Telugu Site icon

Cabinet Sub-Committee: ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన..

Cabinet Sub Committee

Cabinet Sub Committee

Cabinet Sub-Committee: రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ఇవ్వాళ ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్మి కమిటీ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు జిల్లాలో కమిటీలోని మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు,సీతక్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కె.బీ. కాంప్లెక్స్ లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉట్నూర్ కు మంత్రుల బృందం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద నుంచి 10.30 గంటలకు మీటింగ్ హాల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహిస్తారు. రైతు భరోసా పై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు ఉపసంఘం తీసుకోనున్నారు.

Read also: Astrology: జులై 11, గురువారం దినఫలాలు

మధ్యాహ్న భోజనం తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ హాల్‌లను స్థానిక శాసన సభ్యులు వెడ్మా బొజ్జుతో కలసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్‌లో పాల్గొనడం జరుగుతుందని, రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారని పేర్కొన్నారు. శాసన సభ్యులు వెడ్మా బొజ్జు మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గ ఉపసంఘం రానున్నందున అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Off The Record: కాంగ్రెస్‌లో పాత వర్సెస్ కొత్త వార్..! వివాదాస్పద రాజకీయాలకు కేరాఫ్ ధర్మపురి..