Errabelli Dayakar Rao: బతుకమ్మ సందర్భంగా ఇస్తున్న చీర రేటు ఎంత అని ఆలోచించొద్దని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఓ తండ్రిగా, అన్నగా ఇస్తున్న కానుకగా భావించాలన్నారు. ఎక్కడైనా చీరలకు నిప్పు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్లు తీసుకోకండి అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న పింఛన్లు, రైతుబంధు మిగతా ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకండి. గతేడాది వరంగల్ పరిధిలో ఆరు చోట్ల ఉత్సవాల నిర్వహణలో కొన్ని లోపాలు కనిపించాయని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం కానుంది. కోటి మందికిపైగా లబ్దిదారులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలను ప్రభుత్వం తయారుచేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లు ఖర్చుచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం సాగుతుంది.
రాష్ట్రంలోని ఈ నెల 25వ తేదీ నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రతీ ఏటా దసరా కంటే ముందు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల కంటే ముందుగానే ఆడపడుచులకు బతుకమ్మ సారే పేరుతో తెలంగాణ ప్రభుత్వం కానుకను అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ ఈ సారి కూడా చీరల పంపిణీకి సిద్ధం అయ్యింది. నిన్నటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.. ఈ ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేయనుంది. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల దారపు పోగుల అంచులతో చీరలు సిద్ధం చేశారు.. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేశారు.
బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్ల ఖర్చు చేస్తోంది. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగ, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ఆడపడుచులకు చీరలు అందిస్తున్నారు. రేషన్ కార్డుల్లో పేరు ఉండి 18 ఏళ్లు పైబడి, అర్హులైన ప్రతీ మహిళకు బతుకమ్మ చీర అందనుంది.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?