Stray Dogs: హైదరాబాద్‌లో వీధి కుక్కలు దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన, ఆ తరువాత మరో బాలుడిపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో నగర అధికారులు స్టెరిలైజేషన్ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి నడుం బిగించారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. అంబర్ పెట్ కుక్క కాటు ప్రమాదంపై అలెర్ట్ అయిన ప్రభుత్వం. నియంత్రణకి మార్గదర్శకాలు జారీ చేసింది. మునిసిపల్ శాఖ 13 పాయింట్స్ తో కూడిన మార్గదర్శకాలు జారీ చేసింది.
Read also: Bandi Sanjay: ప్రజలకు ఏ సమస్య వచ్చిన బీజేపీ అండగా ఉంటుంది
మునిసిపల్ శాఖ 13 పాయింట్స్..
1. కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం…
2.కుక్కలు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ…
3. సిటిజన్స్ ghmc పరిధి లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111…
4.మాసం దుఖణలు హోటల్స్ వారు వ్యర్థలను రోడ్స్ పై వేయకుండా ghmc వాహనాలకు మాత్రమె ఇవ్వాలి…
5.కుక్కల స్థితి ని ghmc ,స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు అవగాహన కల్పించాలి….
6.స్కూల్స్ లో విద్యార్థులు విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలని వివరించాలి….
7.కాలనీ సంఘాలు,బస్తి లలో వచ్చే నెల రోజులు కుక్క కాటు పై అవగహన కల్పించాలి….
8.Ghmc పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బంది తో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి….
9.కాలనిలే కాకుండా ,మూసి పరిసర ప్రాంతాల్లో,చెట్లు ఎక్కువ ప్రాంతాల్లో ని కుక్కలను సైతం ఆపరేషన్ వేయడం,రేబిస్ టీకా వేయడం చేయాలి…
10.విధి కుక్కల దత్తత తీసుకోవడం పై అవగహన….
11.కుక్క కాటు కు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.
12. విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్,పోస్టర్స్, బిల్ బోర్డ్స్ తో ప్రచారం…
13. విధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు GHMC ఉంచాలి…
Dog Bite: కుక్క కాటుకంటే దానిపట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరం