ఇటీవల కుక్క కరిచిన ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణాలో మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కుక్క కరిసిన కేసులు బాగా పెరుగుతున్నాయి.
సమ్మర్ వస్తుండడం తో పాటు కుక్కలకి బ్రీడింగ్ టైం అవ్వడంతో ఈ కేసులు పెరుగుతున్నాయి అని వెటర్నరీ వైద్యులు అంటున్నారు.
అసలు కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ప్రాణాలకు ప్రమాదం కాకుండా ఉండాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి?
వీధి కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్సలో భాగంగా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ లు ఇచ్చే చికిత్స గతంలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతి మారింది.
ట్రీట్మెంట్ లో భాగంగా కుక్క కరిచిన వ్యక్తికి ఐదుసార్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కరిచిన రోజు, మూడవ రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 28వ రోజు భుజానికి రెబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
కుక్క కరిచిన చోట రక్త స్రావం అయితే మాత్రం ఈ వ్యాక్సిన్ తో పాటు కరిచిన రెండు రోజుల లోపు ఇమ్యునోగ్లోబిలిన్స్ ఇంజక్షన్ కరిచిన చోట తీసుకోవాలి.
ఈ ఇమ్యునోగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ శరీరానికి ఇమీడియట్ బూస్టర్ల పనిచేస్తుంది. దీనివల్ల కరిచిన కుక్క పిచ్చి కుక్క అయితే రేబిస్ వ్యాధి సోకకుండా ఉపయోగపడుతుంది.
కుక్క కాటునీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం రెబిస్ వ్యాధి సోకుతుంది. రేబిస్ సోకితే ప్రపంచం ఎక్కడ ట్రీట్మెంట్ లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే కుక్క కరిస్తే ఐపిఎ కో ..లేక ఫీవర్ ఆస్పత్రి కో ట్రీట్మెంట్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు ప్రభుత్వ వైద్యులు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో, ఏరియా ఆసుపత్రులలో, జిల్లా ఆసుపత్రులలో కుక్కకాటుకు సంబంధించిన వ్యాక్సిన్, మెడిసిన్ అందుబాటులో ఉంది అని చెబుతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా చికిత్స అందుబాటులో ఉందని వైద్యులు అంటున్నారు. కుక్క కాటుకంటే దాని పట్ల నిర్లక్షమే ఎక్కువ ప్రమాదకరమైనది.
తప్పుడు సలహాలు విని నిర్లక్ష్యం చేస్తే మృత్యువాత పాడడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.